నంద్యాల సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌కు బెయిల్‌ 

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టయిన సీఐ సోమశేఖర్‌ రెడ్డి,

Updated : 09 Nov 2020 18:07 IST

నంద్యాల (నేర విభాగం): కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన అబ్దుల్‌సలాం కుటుంబం ఆత్మహత్య కేసులో అరెస్టయిన సీఐ సోమశేఖర్‌ రెడ్డి, హెడ్‌ కానిస్టేబుల్‌ గంగాధర్‌కు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. నిందితులపై 303, 506, 509, 306 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. నిందితుల తరఫున సీనియర్‌ న్యాయవాదులు కేసును వాదించారు. ఈ కేసులో సెక్షన్‌ 306 వర్తించదని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా న్యాయమూర్తి ఆ సెక్షన్‌ను తొలగించారు. అనంతరం రూ.10వేల పూచీకత్తుపై సీఐ, హెడ్‌కానిస్టేబుల్‌కు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. 

ఆత్మహత్యకు ముందు అబ్దుల్‌ సలాం కుటుంబం తీసుకున్న సెల్ఫీ వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఘటనకు బాధ్యులుగా గుర్తించిన సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌పై పోలీసులు ఆదివారం వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు. 

ఇవీ చదవండి..

ఒత్తిడి భరించలేకే చనిపోతున్నాం..

నంద్యాల సీఐ సోమశేఖర్‌రెడ్డి అరెస్ట్‌

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని