‘రాచకొండ పరిధిలో 12 శాతం నేరాల తగ్గుదల’

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో వార్షిక నేర నివేదిక విడుదల చేసిన రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్ 12 శాతం నేరాలు తగ్గాయని వెల్లడించారు....

Published : 28 Dec 2020 18:11 IST

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ సమయంలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని ప్రజలకు విస్రృత సేవలందించామని సీపీ మహేశ్‌ భగవత్ పేర్కొన్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ఈ ఏడాది అనేక సమస్యలు, సవాళ్లు ఎదురైనా వాటిని చాకచక్యంగా పరిష్కరించామని తెలిపారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో వార్షిక నేర నివేదిక విడుదల చేసిన ఆయన 12 శాతం నేరాలు తగ్గాయని వెల్లడించారు. సామాజిక మాధ్యమాల ద్వారా 4,926 ఫిర్యాదులు వచ్చాయని 36 కేసులను సీసీ కెమెరాల ద్వారానే ఛేదించామని వివరించారు. నేరాలు చేసిన నిందితులకు 51 శాతం శిక్షలు పడటంలో రాజీ లేని పోరాటం చేశారని పోలీసులను అభినందించారు.

లాక్‌డౌన్‌ సమయంలో మాస్కు ధరించనివారు, కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించడం సహా ఇతర నేరాలకు పాల్పడినవారి పట్ల టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది కఠినంగా వ్యవహరించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. హత్యలు 31 శాతం తగ్గగా.. దోపిడీలు, దొంగతనాలు 60 శాతం మేర తగ్గాయని పేర్కొన్నారు.

ఇవీ చదవండి...

రేవ్‌ పార్టీ.. పోలీసుల అదుపులో యువతులు

భార్యను హత్య చేసి.. సాక్ష్యాలను మార్చేసి..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని