IN PICS: భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం

Updated : 17 Aug 2020 12:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. వర్షం కారణంగా పలు రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. మరోవైపు గోదావరి నది ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకూ వరద ప్రవాహం పెరిగి ప్రమాదస్థాయిలో ప్రవహిస్తోంది. వరద ప్రవాహంతో ముంపు గ్రామాల ప్రజలు భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. వందల హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ చిత్రాలు ఇవీ..


ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి వద్ద ప్రమాద కరంగా ప్రవహిస్తున్న గోదావరి

రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌ వద్ద గోదావరి ఉద్ధృతి

జొన్నాడ వంతెన వద్ద గోదావరి ఉద్ధృతి


కరీంనగర్‌ జిల్లా ధర్మపురి మండలంలో మత్తడి పారుతున్న నెరేళ్ల చెనుగ చెరువు 


జగిత్యాల నుంచి సారంగాపూర్‌ వెళ్లే ప్రధాన రహదారిపై కోనాపూర్‌ వద్ద

వంతెనపై నుంచి పారుతున్న వరద నీరు


ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్‌ కొండాపూర్‌ గ్రామ శివారులోని

లో లెవెల్‌ బ్రిడ్జి మీద ప్రవహిస్తున్న వరద నీరు


పశ్చిమగోదావరి జిల్లా పాత పోలవరం వద్ద నెక్లెస్‌ బండు లీక్‌ అవడంతో ఇసుక బస్తాలను వేస్తున్న అధికారులు


మత్తడి దూకుతున్న కామారెడ్డి పెద్ద చెరువు


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని