అయోధ్యలో మోదీ: మినిట్‌-టు-మినిట్‌

రామజన్మభూమి అయోధ్యలో రామమందిర భూమిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు కొద్దిమంది ప్రముఖులు మాత్రమే పాల్గొన్నారు.

Updated : 05 Aug 2020 20:09 IST

దాదాపు 3 గంటలపాటు అయోధ్యలో మోదీ పర్యటన
వైభవంగా రామమందిర భూమిపూజ కార్యక్రమం

అయోధ్య: రామజన్మభూమి అయోధ్యలో రామమందిర భూమిపూజ కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు కొద్దిమంది ప్రముఖులు మాత్రమే పాల్గొన్నారు. సుదీర్ఘకాలం తరువాత నరేంద్ర మోదీ అయోధ్యలో అడుగుపెట్టడం విశేషం. అయోధ్యలో మోదీ పర్యటన సాగిందిలా..

♦ ఉ.11.40- నిమిషాలకు అయోధ్య చేరుకున్న మోదీ. స్వాగతం పలికిన ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ తదితరులు..

⇒ 11.45- హనుమాన్‌గఢీ ఆలయం సందర్శన. ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు. హనుమాన్‌కు హారతి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు..

⇒ 11.50- అయోధ్య రామాలయంలోని ఉత్సవ విగ్రహానికి పూజలు.. సాష్టాంగ నమస్కారం, అనంతరం ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను నాటారు.

⇒ 11.55- రామాలయం నుంచి భూమిపూజకు బయలు దేరిన మోదీ. ప్రధానితో పాటు యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ కూడా ప్రధాని వెంటే ఉన్నారు.

⇒ మ.12.08- నిమిషాలకు భూమిపూజ ప్రదేశానికి చేరుకున్న ప్రధాని మోదీ.

⇒ 12.15- రామమందిర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ప్రారంభం.

⇒ 12.49- ముగిసిన భూమిపూజ క్రతువు.

⇒ 12.50- అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై ఆసీనులైన ప్రధాని, యూపీ గవర్నర్‌, ముఖ్యమంత్రి, రామమందిర ట్రస్ట్‌ సారథి మహంత్‌ నృత్యగోపాల్‌ దాస్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌.

⇒ 1.00- తొలుత యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ ప్రసంగం. అనంతరం మోహన్‌ భగవత్‌, నృత్యగోపాల్‌ దాస్‌లు ప్రసంగించారు. చివరగా ప్రధాని మోదీ మాట్లాడారు.

⇒ 1.30- ప్రసంగం ప్రారంభించే ముందు శ్రీరాముని చిహ్నంగా తపాలా బిళ్ల విడుదల చేసిన మోదీ.

⇒ 1.31- ప్రసంగం ప్రారంభం. 35నిమిషాల పాటు మాట్లాడిన ప్రధాని.

⇒ 2.07ని.లకు మోదీ తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రారంభించారు. 

ఈ కార్యక్రమం పూర్తైన అనంతరం తిరిగి దిల్లీ బయలుదేరారు. ఇలా అయోధ్యలో ప్రధాని మోదీ పర్యటన దాదాపు 2గంటల 45నిమిషాల పాటు కొనసాగింది. అయోధ్య రామమందిరం భూమిపూజ కార్యక్రమంలో మోదీతోపాటు యూపీ గవర్నర్‌ ఆనందిబెన్‌, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి, యోగా గురు రామ్‌దేవ్‌ బాబా, పీఠాధిపతులు పాల్గొన్నారు. రామజన్మభూమి ట్రస్ట్‌ సారథి నృత్యగోపాల్ దాస్‌ ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

ఇవీ చదవండి..
దేశమంతా రామమయం: ప్రధాని మోదీ
మోదీ ప్రతిజ్ఞ నెరవేరిన రోజు..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని