సుప్రీంకోర్టులో తెలంగాణకు ఊరట

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలు పాటించలేదని ప్రజారోగ్య

Published : 16 Dec 2020 13:53 IST

దిల్లీ: సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలు పాటించలేదని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావుకు ఇటీవల తెలంగాణ హైకోర్టు... కోర్టు ధిక్కరణ నోటీసు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది.  కరోనా నియంత్రణకు అవసరమైన మేరకు ప్రభుత్వం పరీక్షలు చేస్తుందని,  రోజూ 50వేల పరీక్షల నిర్వహణ కష్టమని కోర్టుకు తెలిపింది. పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం .. కరోనా పరీక్షల అంశంలో హైకోర్టు ఇచ్చిన కోర్టు ధిక్కరణ ఆదేశాలపై స్టే ఇచ్చింది.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని