మొసలి-తాబేలు హైఫై దోస్తానా!

వన్యప్రాణులకు సంబంధించిన అనేక వీడియోలు ఈమధ్య వైరలవుతున్నాయి..

Updated : 09 Sep 2020 14:58 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్యప్రాణులకు సంబంధించిన అనేక వీడియోలు ఈ మధ్య వైరలవుతున్నాయి. తాజాగా మరో వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. మొసలిని చూస్తేనే భయపడి పారిపోయే తాబేలు దానికి హైఫై ఇస్తున్నట్లు ఉన్న ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. సరీసృపాలకు సంబంధించి ట్విట్టర్‌లో 'గేటర్స్‌ డైలీ' పేరుతో నిర్వహిస్తున్న పేజీలో నిర్వాహకులు ఈ వీడియోను పంచుకున్నారు. ఏడు సెకన్ల నిడిడిగల ఆ వీడియోలో ఓ భయంలేని తాబేలు మొసలి వద్దకు ఈదుకుంటూ వచ్చి దాని చేతిని తాకి వెళ్లిపోతుంది. అది హైఫై ఇచ్చినట్లు ఉండటంతో ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ట్విటర్‌లో ఆ వీడియోని 11 మిలియన్ల మంది వీక్షించారు. 
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని