Cardio: గుండె పెరిగిందా...? ఇబ్బందులేంటో తెలుసుకోండి..!

గుప్పెడంతా గుండె సజావుగా ఉంటే ఏ ఇబ్బందులుండవు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, మధుమేహం లాంటి జబ్బులు వస్తే చిన్ని గుండెకు సమస్యలు మొదలవుతాయి. ఉండాల్సినంత పరిమాణంలో కాకుండా గుండె కాస్త పెరుగుతుంది.

Updated : 28 Sep 2022 12:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుప్పెడంతా గుండె సజావుగా ఉంటే ఏ ఇబ్బందులుండవు. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, మధుమేహం లాంటి జబ్బులు వస్తే చిన్ని గుండెకు సమస్యలు మొదలవుతాయి. ఉండాల్సినంత పరిమాణంలో కాకుండా గుండె కాస్త పెరుగుతుంది. ఇలా పెరగడంతో రక్త సరఫరాలో సమస్యలు తలెత్తుతాయని ప్రముఖ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ శ్రీధర్‌ కస్తూరి పేర్కొన్నారు.

ఇలా ఎందుకవుతుందంటే...!

క్రీడాకారులు, వ్యవసాయదారులు ఎక్కువ శ్రమ చేయడంతో గుండె పరిమాణం పెరుగుతుంది. దీనితో ప్రమాదం ఉండదు. గుండె కండరాలు బలహీనం కావడం, వాల్వ్‌లు దెబ్బతినడంతో గుండె ఉండేదానికంటే కాస్త పెద్దగా అవుతుంది. గుండె గదులు పెరిగే సమస్య పుట్టుకతోనే కొన్నిసార్లు రావొచ్చు. కాల్షియం పేరుకొని పోవడంతోనూ ఇబ్బందులు వస్తాయి. కొంచెం నడిచినా ఆయాసం, కాళ్ల వాపు వస్తుంది. ఇలాంటి సమస్యతో గుండెపోటు వచ్చే వీలుంటుంది.

ఏం చేయాలంటే...

ఈసీజీ, ఎకో చేస్తే సమస్య తెలుస్తుంది. మందులు కూడా చాలా వచ్చాయి. ఆపరేషన్‌ లేకుండా నయం చేయొచ్చు. ముందుగా యాంజియో చేయాలి. ఇలా చేయడంతో కొంతమందికి సమస్య తగ్గిపోతుంది. తొలిదశలో గుర్తించడంతో మందులతోనే సరిపోతుంది. లేకపోతే ఆపరేషన్‌ దాకా వెళ్లాల్సి వస్తుంది. వ్యాయామం చేయడం, మద్యం, ధూమపానం వదిలేస్తే గుండె సురక్షితంగా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని