Anand Mahindra: మిస్‌ యూనివర్స్‌ ‘హర్నాజ్‌’ జవాబుకి ఆనంద్‌ మహీంద్రా ఫిదా

కొత్త విషయాలను, ఇతరుల్లో దాగి ఉన్న ప్రతిభను తన ట్విటర్‌ వేదికగా ప్రపంచానికి తెలియజేస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా. సోమవారం మిస్‌ యూనివర్స్‌-2021 కిరీటాన్ని కైవసం చేసుకున్న పంజాబీ అమ్మాయి హర్నాజ్‌ కౌర్‌ను ఆనంద్‌ అభినందించారు.

Published : 13 Dec 2021 17:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొత్త విషయాలను, ఇతరుల్లో దాగి ఉన్న ప్రతిభను తన ట్విటర్‌ వేదికగా ప్రపంచానికి తెలియజేస్తుంటారు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా. సోమవారం మిస్‌ యూనివర్స్‌-2021 కిరీటాన్ని అందుకున్న పంజాబీ అమ్మాయి హర్నాజ్‌ కౌర్‌ను ఆనంద్‌ అభినందించారు. “వారాన్ని ప్రారంభించడానికి ఇంతకంటే శుభవార్త మరొకటి లేదు’’ అంటూ ట్వీట్‌ చేశారు. అందం, తెలివితేటల వడబోతే మిస్‌ యూనివర్స్ కిరీటానికి మార్గం. పోటీల్లో భాగంగా చివర్లో ఉండే ప్రశ్నోత్తరాల రౌండ్‌ ఉత్కంఠ భరితంగా ఉంటుంది. అందులో హర్నాజ్‌ను ‘‘ నేటితరం యువత ఒత్తిడిని ఎదుర్కొనేందుకు మీరిచ్చే సలహా ఏమిటి’’ అని అడగగా...‘‘ యువత ఎదుర్కొంటున్న అతి పెద్ద ఒత్తిడి ఏమిటంటే.. వారి మీద వారు విశ్వాసం కోల్పోవడం. ఎవరికీ వారు ప్రత్యేకమని తెలుసుకోకపోవడం. అందంగా మారాలంటే.. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకోవడం మానేయండి. ముఖ్యంగా సమాజంలోకి రావాలి.. మీ కోసం మీరు మాట్లాడాలి.. ఎందుకంటే ఎవరి జీవితానికి వారే లీడర్‌. కాబట్టి మీ గొంతును సమాజంలో వినిపించండి.. నేను అదే సూత్రాన్ని నమ్మాను.. పాటించాను..అందుకే ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నాను’’  అంటూ హర్నాజ్ సమాధానం చెప్పింది. ఇదే వీడియోని ట్విటర్లో షేర్‌ చేశారు ఆనంద్‌. గతంలో ఈ ఘనతను సాధించిన సుస్మితా సేన్(1994)‌, లారా దత్తా(2000)ల సరసన చేరింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని