జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ వాయిదా

సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది.

Published : 11 Jan 2021 11:21 IST

హైదరాబాద్‌ : సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి, నిత్యానందరెడ్డి, రాంప్రసాద్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డి విచారణకు హాజరయ్యారు. ఇవాళ విచారణకు హాజరుకావాలని సీఎం జగన్‌ను ఇటీవల ఈడీ కోర్టు ఆదేశించింది. అయితే ఈ రోజు అధికారిక కార్యక్రమాలు ఉన్నందున విచారణకు జగన్‌ హాజరుకావడం లేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. తదుపరి విచారణను కోర్టు ఈ నెల21కి వాయిదా వేసింది.

నాంపల్లి కోర్టు నుంచి ఈడీ కోర్టుకు అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ ఇటీవల బదిలీ అయ్యింది. అరబిందో, హెటిరో భూ కేటాయింపుల చార్జిషీట్‌ను విచారణకు స్వీకరించిన ఈడీ కోర్టు ..ఈనెల 11న విచారణకు హాజరుకావాలని ఆదేశిస్తూ సీఎం జగన్‌కు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..
ఏపీ సీఎం జగన్‌కు ఈడీ కోర్టు సమన్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని