Andhra News: మృతదేహాలతో వ్యాపారం చేసేవారికి కఠిన శిక్షలు: విడదల రజని

మృతదేహాలతో వ్యాపారం చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని హెచ్చరించారు.

Updated : 26 Apr 2022 17:08 IST

అమరావతి: మృతదేహాలతో వ్యాపారం చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజని హెచ్చరించారు. తిరుపతి రుయా ఘటనపై మంత్రి స్పందించారు. ఘటనపై రుయా సూపరింటెండెంట్‌ వివరణ కోరినట్లు చెప్పారు. మృతుడి కుటుంబాన్ని ఎవరు బెదిరించారని.. వారు ఆస్పత్రి సిబ్బందా, లేక ప్రైవేటు వ్యక్తులా అనే దానిపై విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు. బాధ్యులను వదిలిపెట్టేదిలేదని, కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మహాప్రస్థానం వాహనాలు 24 గంటలూ పనిచేసే విధానాన్ని తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. ఈ వాహనాల్లోనే మృతదేహాలను తరలించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ప్రీపెయిడ్‌ ట్యాక్సీ తీసుకొచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అన్ని ఆస్పత్రుల వద్ద ప్రైవేటు అంబులెన్సులను నియంత్రిస్తామని మంత్రి స్పష్టం చేశారు.

రుయా ఘటనపై ముగ్గురు అధికారులతో విచారణ కమిటీ వేసినట్లు మంత్రి రోజా తెలిపారు. డీఓంహెచ్‌వో, రుయా సూపరింటెండెంట్‌, ఆర్డీవోతో కమిటీలో సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు. విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కమిటీని ఆదేశించినట్లు రోజా పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని