AP High Court: రుషికొండ తవ్వకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

విశాఖలోని రుషికొండ తవ్వకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రుషికొండపై సర్వే చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారుల బృందాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

Updated : 03 Nov 2022 13:38 IST

అమరావతి: విశాఖలోని రుషికొండ తవ్వకాలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రుషికొండపై సర్వే చేయాలని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ అధికారుల బృందాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.

అనుమతికి మించి ఎంత మేర తవ్వకాలు చేపట్టారు.. ఎంత మేర భవనాలు నిర్మిస్తున్నారో సర్వే చేయాలని సూచించింది. సర్వే చేసి నివేదికలను హైకోర్టుకు సమర్పించాలని సర్వే బృందాన్ని ధర్మాసనం ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను డిసెంబర్‌ 14కు వాయిదా వేసింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని