
AP News: ఏపీలో మరో మంత్రికి కరోనా పాజిటివ్
అమరావతి: ఏపీలో మరో మంత్రి కరోనా బారినపడ్డారు. ఇటీవల మంత్రి కొడాలి నాని కొవిడ్ బారినపడి కోలుకోగా.. తాజాగా ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందనీ.. స్వల్ప లక్షణాలే ఉన్నాయని ఆయనే స్వయంగా ప్రకటించారు. హోం ఐసోలేషన్‌లోనే ఉన్నట్టు తెలిపారు. గత కొన్ని రోజులుగా తనను కలిసినవారంతా జాగ్రత్తగా ఉండాలనీ.. పరీక్షలు చేయించుకోవాలని ట్విటర్‌లో కోరారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని విజ్ఞప్తి చేశారు.
మరోవైపు, ఏపీలో కొవిడ్ కేసులు మళ్లీ భారీ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 43,763 టెస్టులు చేయగా.. 12,926 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 73వేలకు చేరడం గమనార్హం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.