Sleep: పని చేస్తున్నపుడు నిద్ర మత్తు వదలడం లేదా..? ఎందుకో తెలుసా..!

పని వేళల్లో కూడా అదే పనిగా నిద్ర వస్తుంటే వాటికి ఎన్నో కారణాలుంటాయి. దినచర్య సక్రమంగా లేకపోవడం, భోజనం చేసే పద్ధతిలో మార్పు రావడంతో పగలు నిద్ర అదే పనిగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Published : 16 Oct 2022 14:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కాస్త కునుకు వేయడంతో మరింత ఉత్సాహంగా పని చేస్తారని పరిశోధకులు పేర్కొన్నారు. దీనికి భిన్నంగా పని వేళల్లో కూడా అదే పనిగా నిద్ర వస్తుంటే వాటికి ఎన్నో కారణాలుంటాయి. దినచర్య సక్రమంగా లేకపోవడం, భోజనం చేసే పద్ధతిలో మార్పు రావడంతో పగలు నిద్ర అదే పనిగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

  • రాత్రి ఉత్సాహంగా ఉండి పగలంతా నిద్రావస్థతో ఉంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ఈ సమస్య తలెత్తడానికి రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడంతో పాటు ఎలక్ట్రానిక్‌ పరికరాల వాడకం ఒక కారణమే.
  • రాత్రి భోజనం ఆలస్యంగా చేయడంతో జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. తిన్నది త్వరగా జీర్ణం కాదు. దీంతో పగటి పూట మత్తుగా ఉంటుంది.
  • స్మార్ట్‌ఫోన్లను తక్కువ వెలుతురులో చూడటంతో నిద్ర దూరం అవుతుంది. ప్రతి రోజు ఒకే సమయానికి నిద్ర పోయేలా చూడాలి.
  • పడుకునే ముందు గదిలోకి వెలుతురు రాకుండా చూసుకోవాలి. ఆల్కహాల్‌ అసలే మంచిది కాదు. 
  • నిద్రలేమితో ఆరోగ్యం దెబ్బతింటుంది. మధుమేహం, బీపీ, క్యాన్సర్‌, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
  • ఆలస్యంగా నిద్రపోవడంతో ఉదయం వ్యాయామం చేయలేకపోతారు. పడుకునే ముందు పుస్తకం చదవడం, పాలలో అర స్పూన్‌ పసుపు కలిపి తాగడంతో మంచి నిద్ర పడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని