ఏం భయంలేదు: ఆ ఉల్క భూమిని ఢీకొట్టదు

మన సౌర కుటుంబంలో ఎన్నో గ్రహాలతో పాటు, ఉల్కలు అంతరిక్ష కక్ష్యలో తిరుగుతూ ఉంటాయి. కొన్ని సార్లు అవి భూమిని ఢీకొట్టడమో లేదా అత్యంత సమీపంగా

Published : 06 Sep 2020 01:01 IST

న్యూదిల్లీ: ఈ నెల 6న ఓ భారీ ఉల్క భూమికి సమీపంగా రానుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) తెలిపింది. ఈజిప్ట్‌ పిరమిడ్‌ కన్నా రెండింతలు పెద్దగా ఉండే ఈ ఉల్కకు 2010ఎఫ్‌ఆర్‌గా నామకరణం చేశారు. అయితే, ఇది భూమిని ఢీకొట్టదని నాసా ట్వీట్‌ చేసింది.

‘‘ఆస్ట్రాయిడ్‌ 2010 ఎఫ్‌ఆర్‌ విషయంలో మన ఖగోళ శాస్త్రవేత్తలకు ఎలాంటి అనుమానాలు లేవు. ఎందుకంటే ఇది భూమిని ఢీకొట్టే అవకాశమే లేదు. సెప్టెంబరు 6న భూమికి దాదాపు 4.6మిలియన్‌ మైళ్ల దూరం నుంచి ఇది వెళ్లిపోతుంది’’ అని నాసా ట్వీట్‌ చేసింది. మార్చి 18, 2010 ఈ భారీ ఉల్కను శాస్త్రవేత్తలు గుర్తించారు. అప్పటి నుంచి నాసా ఈ ఉల్క కదలికలను గమనిస్తూ ఉంది. సెప్టెంబరు 6న ఇది భూ కక్ష్యను దాటుతుందని భావిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని