నెల్లిమర్ల కొవిడ్‌ ఆసుపత్రిలో దారుణం

విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని మిమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. మంచంపై నుంచి కిందపడిన శవం రాత్రి నుంచి వార్డులోనే ఉంది...

Updated : 28 Aug 2020 13:46 IST

నెల్లిమర్ల: విజయనగరం జిల్లా పార్వతీపురం ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌ సాహు(54) అనే వ్యక్తి జిల్లా మిమ్స్‌ కొవిడ్‌ ఆసుపత్రిలో నాలుగు రోజుల నుంచి కరోనా చికిత్స పొందుతున్నాడు. శ్వాస అందకపోవడంతో గురువారం రాత్రి మృతి చెందాడు. మృతదేహం ఈ రోజు ఉదయం మంచంపై నుంచి కింద పడి ఉంది. వైద్య సిబ్బంది మృతదేహాన్ని గమనించినా పట్టించుకోలేదు. 

 దీంతో వార్డులోని కరోనా బాధితులు మృతదేహాన్ని చూసి ఆందోళన చెందుతున్నారు. దీనిపై మిమ్స్‌ వైద్యుడు సాగర్‌ మాట్లాడుతూ...  కరోనా రోగి చనిపోయిన 7 గంటల వరకు వైరస్‌ ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు. అందువల్ల మృతదేహాన్ని మార్చురీకి తరలించడానికి ఆలస్యమైందన్నారు. 7గంటల సమయం ముగిసిన తర్వాత మృతదేహాన్ని మార్చురీకి తరలిస్తామన్నారు. మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చామని,  ఖననానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.  
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని