Telangana news: ఎఫ్‌ఆర్వో హత్య.. వారందర్నీ గ్రామం నుంచి బహిష్కరించండి

అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు హత్యను ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ తీర్మానించింది. గొత్తికోయలందర్నీ గ్రామం నుంచి బహిష్కరించాలని గ్రామసభ నిర్ణయించింది.

Published : 27 Nov 2022 01:34 IST

ఖమ్మం: అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు హత్యను ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు పంచాయతీ తీర్మానించింది. గొత్తికోయలందర్నీ గ్రామం నుంచి బహిష్కరించాలని గ్రామసభ నిర్ణయించింది. వారందర్నీ ఎర్రబోడు నుంచి ఛత్తీస్‌గఢ్‌కు తరలించాలని తీర్మానంలో పేర్కొంది. పోడు సాగుకు అడ్డొస్తున్నారని చంద్రుగొండ రేంజ్‌ అటవీ అధికారి (ఎఫ్‌ఆర్వో) చలమల శ్రీనివాసరావు(45)ను గొత్తికోయలు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది.

రాష్ట్రస్థాయి ఉద్యోగులతో డోబ్రియాల్‌ సమీక్ష

ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో రాష్ట్రస్థాయి అటవీ ఉద్యోగులతో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్‌) డోబ్రియాల్‌ సమీక్ష నిర్వహించారు. అన్ని వర్గాల మద్దతుతో అడవిని కాపాడాలన్నారు. అటవీ రక్షణే ప్రథమ విధి అని, సిబ్బంది తమ విధుల్లో పాల్గొనాలని కోరారు. ఉద్యోగుల భద్రత, రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆయుధాలు, ఫారెస్ట్‌ స్టేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని చెప్పారు. ఎఫ్‌ఆర్వో హత్య తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వేగంగా స్పందించిందని, పోలీస్‌ శాఖ సహకారంపై డీజీపీ స్పష్టమైన ఆదేశాలిచ్చారన్నారు. గొత్తికోయల వల్ల అడవికి జరుగుతున్న నష్టంపై ప్రభుత్వం దృష్టిపెట్టిందని, పోడు సమస్య పరిష్కారానికి కృషి చేస్తోందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని