Bhatti Vikramarka: కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా: డిప్యూటీ సీఎం భట్టి

యాదాద్రి ఆలయంలో తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

Updated : 12 Mar 2024 15:58 IST

హైదరాబాద్‌: యాదాద్రి ఆలయంలో తాను కావాలనే చిన్నపీట మీద కూర్చున్నానని, దాన్ని సామాజిక మాధ్యమాల్లో అర్థంపర్థం లేకుండా ట్రోల్‌ చేస్తున్నారని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బంజారాహిల్స్‌లో నిర్వహించిన సింగరేణి అతిథిగృహ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాదాద్రి ఘటనపై వివరణ ఇచ్చారు.

‘‘మా ప్రభుత్వం వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో భాగంగా పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం విజయవంతం కావాలని కోరుకుంటూ యాదగిరిగుట్టలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేశాం. దీనిలో భాగంగా కావాలనే చిన్నపీట మీద కూర్చున్నా. ఉపముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని శాసిస్తున్నా. మూడు శాఖలతో ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నా. ఆత్మగౌరవంతో జీవించే మనిషిని. నన్ను ఎవరూ అవమానించలేదు. అందరూ దీన్ని అర్థం చేసుకోవాలని కోరుతున్నా. సింగరేణి సంస్థను మరింత అభివృద్ధి చేస్తాం. ఈ సంస్థ ఆదాయాన్ని కార్మికులకు, రాష్ట్ర ప్రజలకే చెందేలా చూస్తాం’’అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని