Bhogi celebrations: తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సందడి

తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. ఇంటి ముంగిళ్లలో రంగవల్లులు..

Updated : 14 Jan 2022 10:43 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో భోగి పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. ఇంటి ముంగిళ్లలో రంగవల్లులు.. వీధి వీధిన భోగిమంటలతో సంక్రాంతి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే ఎక్కడ చూసినా భోగిమంటలతో.. ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లులు వేస్తూ చిన్న పెద్ద అందరూ సందడి చేస్తున్నారు. భోగి భోగభాగ్యాలు కలిగించాలని, ఏడాడంతా సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ భోగిమంటల వేసుకుంటున్నారు. ఇంట నవ ధాన్యాలు, సిరి సంపదలు ఏడాది పాటు ఉండాలని కోరుకుంటూ పాత వస్తువులను తీసివేస్తూ వాటితో భోగిమంటలు వేసుకుంటూ కేరింతలు కోడుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని