TTD Temple: నవీ ముంబయిలో శ్రీవారి ఆలయానికి భూమిపూజ

మహారాష్ట్రలోని నవీ ముంబయిలో శ్రీవారి ఆలయానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌షిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, రేమాండ్స్ అధినేత సింఘానియా, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated : 07 Jun 2023 11:29 IST

తిరుమల: మహారాష్ట్రలోని నవీ ముంబయిలో శ్రీవారి ఆలయానికి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌షిందే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌, రేమాండ్స్ అధినేత సింఘానియా, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏక్‌నాథ్‌ షిందే మాట్లాడుతూ తిరుమల తరహాలో నవీ ముంబయిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు తితిదే ముందుకు రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఆలయ నిర్మాణంతో ఈ ప్రాంతం ఆర్థికంగా మరింత ముందుకు వెళ్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. తితిదే ఆలయ నిర్మాణానికి పూర్తిగా సహకరిస్తామన్నారు. తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకోలేని భక్తులకు ఈ ఆలయంలో దర్శన భాగ్యం కలుగుతుందని చెప్పారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ శ్రీవారి ఆలయ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం 10 ఎకరాల స్థలం కేటాయించిందన్నారు. రెండేళ్లలో తిరుమల ఆలయం తరహాలోనే ఇక్కడా నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని