Children: పిల్లలను జలుబు వదలడం లేదా..? ఏం చేయాలో తెలుసుకోండి...!

వానాకాలం వస్తే చిన్నారులకు జలుబు, దగ్గు రావడం చాలా సాధారణం..కానీ సీజన్‌తో సంబంధం లేకుండా జలుబు, దగ్గు, ఆయాసం వస్తే మాత్రం అశ్రద్ధ చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి సమస్య పిల్లల ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో వస్తుందని పేర్కొంటున్నారు.

Published : 25 Aug 2022 02:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వానాకాలం వస్తే చిన్నారులకు జలుబు, దగ్గు రావడం చాలా సాధారణం..కానీ సీజన్‌తో సంబంధం లేకుండా జలుబు, దగ్గు, ఆయాసం వస్తే మాత్రం అశ్రద్ధ చేయొద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇలాంటి సమస్య పిల్లల ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ సోకడంతో వస్తుందని పేర్కొంటున్నారు. దీన్నే బ్రాంకోలైటీస్‌గా చెబుతారు. దీనికున్న చికిత్స, పరిష్కార మార్గాలను నియోనేటాలజిస్టు డాక్టర్‌ ప్రీతమ్‌ సూచించారు.

ఈ సమస్య ఎందుకొస్తుంది..!

ఇది ఎక్కువగా చిన్న పిల్లల్లోనే వస్తుంది. వైరల్‌ ఇన్‌ఫెక్షన్‌తోనే రానుంది. జలుబుగా మొదలైన తర్వాత దగ్గు ఉంటుంది. తర్వాత జ్వరం, ఆయాసం ఎక్కువ అవుతుంది. ఈ సమయంలో ఆక్సిజన్‌ తగ్గుతుంది. ఆయాసంతో పిల్లలు పాలు కూడా తాగలేరు. ఇలాంటప్పుడు పిల్లలకు జ్వరం మందులతో పాటు ఆక్సిజన్‌ అందించాలి. వీటితో సమస్య తగ్గిపోతుంది. అవసరమైతే నెబులైజేషన్‌ పెట్టడంతో ఊపిరితిత్తుల్లోని ఎయిర్‌వేస్‌ తెరుచుకుంటాయి. పిల్లలను పొడి వాతావరణంలో ఉంచేలా చూడాలి. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని