Viveka Murder Case: వివేకా హత్య కేసు.. ఉదయ్ కుమార్ రెడ్డికి ఎస్కార్ట్ బెయిల్

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డికి సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది.

Updated : 13 Sep 2023 16:37 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డికి సీబీఐ కోర్టు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు ఉదయ్ కుమార్ రెడ్డికి ముగ్గురు కానిస్టేబుళ్ల భద్రతతో న్యాయస్థానం బెయిల్‌కు అనుమతించింది. ఈ మేరకు రాకపోకలకు అయ్యే ఖర్చును మొత్తం ఉదయ్ కుమార్ రెడ్డి భరించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. 

అయితే, ఉదయ్‌ కుమార్‌ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఈ నెల 11న వాదనలు పూర్తయ్యాయి. తన భార్య గర్భవతిగా ఉందని, 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును ఉదయ్ కుమార్ రెడ్డి కోరారు. తన భార్యను చూసుకోవడానికి ఎవరూ లేరని కోర్టుకు తెలిపారు. సీబీఐ తరఫు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపిస్తూ బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు వివరించారు. ఈ కేసులో ఆరో నిందితుడిగా ఉన్న ఉదయ్ కుమార్ రెడ్డికి వివేకా హత్య గురించి ముందే తెలుసని.. ఈ మేరకు తన తల్లికి ఈ విషయం చెప్పినట్లు పీపీ కోర్టుకు తెలిపారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 11న తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఎస్కార్ట్‌ బెయిల్‌ను మంజూరు చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని