Mekapati Goutham Reddy: గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై ప్రముఖుల దిగ్భ్రాంతి
ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు, ఆయన సన్నిహితులు విచారం వ్యక్తం చేశారు.
హైదరాబాద్: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై పలువురు రాజకీయ ప్రముఖులు, ఆయన సన్నిహితులు విచారం వ్యక్తం చేశారు. ఆయనతో తమకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. గౌతమ్‌రెడ్డి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
‘‘గౌతమ్‌రెడ్డి తాత సమయం నుంచి ఆ కుటుంబంతో సాన్నిహిత్యం ఉంది. నేనంటే ఎంతో అభిమానం చూపేవారు. గౌతమ్‌రెడ్డి పరమపదించడం అత్యంత విచారకరం. గౌతమ్ ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులు. ప్రజా సమస్యల పట్ల అవగాహన, పని పట్ల నిబద్ధత కలిగిన నాయకుడు’’- ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
‘‘తొలినాళ్ల నుంచి సుపరిచితుడైన యువనాయకుడు గౌతమ్‌రెడ్డి. మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేను. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’
- ఏపీ సీఎం జగన్
‘‘మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతి కలచివేసింది. ఎంతో భవిష్యత్ ఉన్న నాయకుడి మృతి బాధాకరం. గౌతమ్‌రెడ్డి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి’’
- తెదేపా అధినేత చంద్రబాబు
‘‘చిన్న వయసులోనే గౌతమ్‌రెడ్డి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారు. గౌతమ్ మరణ వార్త బాధించింది. చిన్న వయస్సులోనే మనల్ని వదిలి వెళ్లడం బాధాకరం. మంత్రిగా చురుగ్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. నిన్నటి వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారు. ఆయన ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడి రంగంలో అభివృద్ధి చెందింది’’
- మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
‘‘ఓ మంచి స్నేహితుడు, అన్నను కోల్పోయాను. ఆయన హఠాన్మరణం చాలా బాధకరం’’- మంత్రి అనిల్ కుమార్
‘‘గౌతమ్‌రెడ్డి వివాద రహితుడు. నాకు బంధువు. నా బంధువు నిశ్చితార్థ కార్యక్రమంలో రాత్రే కలిశా. మచ్చ లేకుండా మంత్రిగా పని చేశారు. అలాంటి గౌతమ్‌రెడ్డి ఇకలేరన్న వార్త నన్ను చాలా బాధించింది. చిన్న వయసులోనే చనిపోవడం చాలా బాధ కలిగించింది’’- సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
‘‘మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణవార్త విని షాక్‌కు గురయ్యాను. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నాను’’
- తెలంగాణ మంత్రి కేటీఆర్
‘‘ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి అకాల మరణం నన్ను కలచివేసింది. మంచి రాజకీయ భవిష్యత్ ఉన్న నేత చిన్న వయసులోనే కన్ను మూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’
- టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
‘‘చిన్న వయసులోనే గౌతమ్‌రెడ్డి మృతి బాధాకరం. నిన్నటి వరకు ఏపీలో పెట్టుబడుల కోసం దుబాయ్‌లో పర్యటించారు. మేకపాటి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గౌతమ్ రెడ్డి మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటు’’
- మంత్రి ఆళ్ల నాని
‘‘మంత్రి గౌతమ్ రెడ్డి మృతి చాలా బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’’ - మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
సీఎం రేవంత్‌రెడ్డిని రోహిత్ వేముల తల్లి రాధిక కలిశారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని ఆయనకు విజ్ఞప్తి చేశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఎల్పీయూ సత్తా.. వర్సిటీ విద్యార్థికి ₹3 కోట్ల ప్యాకేజీ (ADVT)
ఉన్నత విద్యలో లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సటీ (LPU) తన జైత్రయాత్ర కొనసాగిస్తోంది. ప్రాంగణ నియామకాల్లో కొత్త రికార్డులను నెలకొల్పుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘భారత్ తలుపులు తెరిచే ఉన్నాయి’.. బైడెన్ వ్యాఖ్యలపై జైశంకర్ కౌంటర్!
-
టీ20ల్లో ‘యాంకర్’ పదానికి చోటే లేదు.. కోహ్లీ బ్యాటింగ్‌లో గేర్లు ఎక్కువే: మూడీ
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
దుస్తుల్లో 25 కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తూ.. చిక్కిన అఫ్గాన్ దౌత్యవేత్త..!
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్