Cm jagan: ఒక ప్రత్యేక యూనివర్సిటీ కిందకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్‌ స్టాఫ్‌ నియామకాల్లో సిఫార్సులకు అవకాశం లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. సమర్థులు, ప్రతిభ ఉన్న వారినే టీచింగ్‌ స్టాఫ్‌గా తీసుకోవాలన్నారు.

Published : 29 Apr 2022 17:28 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్‌ స్టాఫ్‌ నియామకాల్లో సిఫార్సులకు అవకాశం లేదని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. సమర్థులు, ప్రతిభ ఉన్న వారినే టీచింగ్‌ స్టాఫ్‌గా తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఉన్నత విద్యపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌.. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలు నిర్వహించి టీచింగ్‌ స్టాఫ్‌ను ఎంపిక చేయాలన్నారు. విశ్వవిద్యాలయాల్లో క్రమశిక్షణ, పారదర్శకత చాలా ముఖ్యమని సీఎం పేర్కొన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీలను త్వరగా పూర్తి చేయాలని అధికారులను అదేశించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఒక ప్రత్యేక యూనివర్సిటీ కిందకు తీసుకురావాలని సీఎం అభిప్రాయపడ్డారు. కోర్సులో భాగంగా పట్టభద్రులకు 10 నెలల ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి చేయాలన్నారు. త్వరలో రాష్ట్రంలో ఏర్పడే 30 నైపుణ్య కళాశాలల్లో ఇంటర్న్‌షిప్‌ ఉండేలా చూడాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని