కురుక్షేత్రలో ఆవు వీరంగం.. వైరల్‌ వీడియో!

హరియాణాలోని కురుక్షేత్రలో ఓ ఆవు వీరంగం సృష్టించింది. రోడ్డుపై ఎరుపు రంగు దుస్తులు ధరించి కనిపించిన వారందరినీ కుమ్మేసింది. సైకిల్‌పై ఎరుపు వర్ణం పోలిన

Updated : 14 Jan 2021 04:45 IST

కురుక్షేత్ర: హరియాణాలోని కురుక్షేత్రలో ఓ ఆవు వీరంగం సృష్టించింది. రోడ్డుపై ఎరుపు రంగు దుస్తులు ధరించి కనిపించిన వారందరినీ కుమ్మేసింది. సైకిల్‌పై ఎరుపు వర్ణం పోలిన దుస్తులు ధరించి వెళ్తున్న ఓ బాలుడిని పొడిచింది. దీంతో బాలుడు కిందపడిపోయాడు. గమనించిన ఓ మహిళ కాపాడేందుకు వెళ్లగా ఆమెపైనా దాడి చేసింది. వీరితోపాటు రోడ్డుపక్కన వెళ్తున్న వారిని సైతం వదల్లేదు. గోవును అక్కడి నుంచి పంపే ప్రయత్నం చేసిన వారిపై కూడా తన ప్రతాపం చూపింది. ఈ ఘటనతో పిల్లలు, పెద్దలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఇవీ చదవండి..
చెట్టును ఢీకొన్న బైక్‌: ముగ్గురి మృతి

హైదరాబాద్‌ నుంచి 11 నగరాలకు కొవాగ్జిన్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని