Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/03/23)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించే నేటి రాశి ఫలాల వివరాలు.
- డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్
తోటివారి సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దలనుంచి ప్రశంసలు లభిస్తాయి. శరీరసౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. ఆంజనేయ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది.
తలపెట్టిన కార్యాలను ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.
చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మనస్సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారాలుంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలున్నాయి. గిట్టని వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం.
మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆలోచనలతో మార్పులు కలగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలుగచేస్తాయి . లింగాష్టకం చదవండి మంచి జరుగుతుంది.
ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలు సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు ప్రశాంతతను ఇస్తాయి. కుటుంబసభ్యులతో సఖ్యతగా మెగాలి. ఎవ్వరితోనూ వాదోపవాదాలు చేయకండి . గణపతి ఆరాధన శ్రేయోదాయకం.
ఉద్యోగంలో సానుకూల ఫలితాలున్నాయి. ప్రయాణాలలో కాస్త జాగ్రత్త అవసరం. తోటివారి సహాయ సహాకారాలు లభిస్తాయి. నూతన ప్రయత్నాలు చేస్తారు. ఇష్ట దైవారాధన చేస్తే అంతా శుభమే జరుగుతుంది.
చేపట్టే పనులను పట్టుదలతో పూర్తిచేసి విజయాన్ని సాధిస్తారు. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడుతాయి. కార్యసిద్ధి విశేషంగా ఉంది. తోటి వారి సహకారం ఉంటుంది. శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం.
మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది చేయవు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. చంద్ర ధ్యానం శుభప్రదం.
మీ కృషే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది .బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. శివారాధన వల్ల శుభఫలితాలను అందుకుంటారు
ముఖ్యమైన వ్యవహారాల్లో శోధన చాలా అవసరం. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్యసాధ్యాలను అంచనా చేయవచ్చు. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. శని ధ్యానం శుభప్రదం.
చేపట్టిన కార్యాలు దైవబలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు రచించడానికి ఇది సరైన సమయం. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పుంజుకుంటారు. ఆంజనేయ ఆరాధన చేయాలి.
కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు . తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయం వృథా చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నవగ్రహ ఆరాధన శుభప్రదం.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Cyber Crime: ఉచిత థాలీ ఎరలో దిల్లీ మహిళ
-
Ap-top-news News
Heat Waves: నేడు, రేపు వడగాడ్పులు!
-
India News
PM Modi: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం.. ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు
-
Crime News
పెళ్లింట మహావిషాదం.. ముగ్గురు తోబుట్టువుల సజీవదహనం
-
Ap-top-news News
YSRCP: పాతపట్నం ఎమ్మెల్యేకు గిరిజనుల నిరసన సెగ
-
India News
Maharashtra: ఆడపిల్ల పుట్టిందని ఏనుగుపై ఊరేగింపు