Hyderabad: ఇలాంటి ఘటనలు పునరావృతం కానివ్వం: డీఏవీ స్కూల్‌ డైరెక్టర్‌ నిషా

డీఏవీ పాఠశాల డైరెక్టర్‌ నిషాతో పాటు మరో నలుగురు ప్రతినిధులు విద్యాశాఖ కమిషనర్‌ను కలిసి పాఠశాలలో జరిగిన ఘటన గురించి వివరించారు. 

Published : 27 Oct 2022 01:53 IST

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ డీఏవీ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు బుధవారం పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను కలిశారు. పాఠశాల యథావిధిగా కొనసాగించాలని చేపట్టిన సంతకాల సేకరణ, అభిప్రాయాలతో కూడిన పత్రాలను కమిషనర్‌కు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు కొన్ని అభిప్రాయాలను కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లారు. తల్లిదండ్రుల ప్రతిపాదనలను విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని కమిషనర్‌ చెప్పినట్టు విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. నవంబరు మొదటి వారంలో పాఠశాల పునఃప్రారంభం అవుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. 

మరో వైపు డీఏవీ స్కూల్‌ యాజమాన్యానికి చెందిన ప్రతినిధులు సైతం కమిషనర్‌ను కలిశారు. డీఏవీ పాఠశాల డైరెక్టర్‌ నిషాతో పాటు మరో నలుగురు ప్రతినిధులు విద్యాశాఖ కమిషనర్‌ను కలిసి పాఠశాలలో జరిగిన ఘటన గురించి వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్యలపై వివరించారు. సీసీ కెమెరాలతో ఏర్పాటుతో పాటు ఆయాలు, సిబ్బంది సంఖ్య పెంచుతామని కమిషనర్‌కు వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సూచించిన కొన్ని అంశాలను కమిషనర్‌ .. డీఏవీ డైరెక్టర్‌ వద్ద ప్రస్తావించారు. ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశీలించి పరిష్కరిస్తామని డీఏవీ డైరెక్టర్‌.. కమిషనర్‌కు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని