
GHMC: జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ జిల్లా తూంకుంట పురపాలక సంఘం పరిధిలో అనుమతి లేకుండా నిర్మించిన కట్టడాలను అధికారులు పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను కూల్చివేయడం పట్ల బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. శంషాబాద్, మణికొండ, పెద్ద అంబర్‌పేటలో అనుమతిలేని కట్టడాలపై కొరడా ఝుళిపించారు. మణికొండ గోకుల్ కాలనీలో భవనాలను హెచ్‌ఎండీఏ, పురపాలక అధికారులు కూల్చివేశారు. శంషాబాద్ పురపాలక పరిధిలోని అక్రమకట్టడాలను కూల్చివేస్తుండగా స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.