Amaravati: ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె చేసేందుకూ వెనుకాడబోం: బండి శ్రీనివాసరావు

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏపీజేఏసీ నేత బండి శ్రీనివాసరావు ఆరోపించారు.

Published : 05 Feb 2024 20:08 IST

అమరావతి: ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏపీ జేఏసీ నేత బండి శ్రీనివాసరావు ఆరోపించారు. ప్రభుత్వ తీరు పట్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. ఈ నెల 11న ఏపీ జేఏసీ విస్తృత కార్యవర్గ సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని.. ఇందుకు సంబంధించిన వినతిని 12న సీఎఎస్‌కి అందజేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె చేసేందుకూ వెనుకాడబోమని హెచ్చరించారు.

‘‘ఉద్యోగులకు పీఎఫ్ సొమ్ము సకాలంలో అందడం లేదు. మేం దాచుకున్న మొత్తాన్ని సరైన సమయానికి తీసుకునే పరిస్థితి లేకుండా పోయింది. 11వ పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ రాలేదు. ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలు ఇవ్వలేదు. ఒకటో తేదీన జీతం, పింఛన్‌ కచ్చితంగా అందుకుంటామన్న నమ్మకం ఉద్యోగుల్లో పోయింది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని