వ్యాక్సినేషన్‌లో ట్రాన్స్‌జెండర్లపై వివక్ష చూపొద్దు

కరోనా నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ట్రాన్స్‌జెండర్లపై వివక్ష చూపకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను

Published : 25 May 2021 00:09 IST

రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ లేఖ

దిల్లీ: కరోనా నివారణ చర్యల్లో భాగంగా చేపట్టిన వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో ట్రాన్స్‌జెండర్లపై వివక్ష చూపకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ కోరింది. ఈ మేరకు సోమవారం అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసినట్లు ఆ శాఖ తెలిపింది.  వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై ట్రాన్స్‌జెండర్లకు అవగాహన కల్పించాలని సూచించింది. కొవిడ్‌ టీకా కేంద్రాల వద్ద వారి పట్ల ఎలాంటి భేదభావం లేకుండా చూడాలని ఆ లేఖలో కోరినట్లు వివరించింది. హరియాణా, అసోంలో మాదిరిగా వారికోసం ప్రత్యేకంగా సంచార వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించింది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని