బ్రాహ్మణి డేగ.. అందం భళా

తెలుపు రంగు ఛాతీ భాగం, గోధుమ రంగు రెక్కలు, బూడిద రంగు తోకతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పక్షిని ‘బ్రాహ్మణి డేగ’, ‘గరుడపక్షి’గా పిలుస్తారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళాసాగర్‌ పరిసరాల్లో ఇది ‘ఈనాడు’ కెమెరాకు

Published : 05 Jan 2020 07:31 IST

తెలుపు రంగు ఛాతీ భాగం, గోధుమ రంగు రెక్కలు, బూడిద రంగు తోకతో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పక్షిని ‘బ్రాహ్మణి డేగ’, ‘గరుడపక్షి’గా పిలుస్తారు. వనపర్తి జిల్లా మదనాపురం మండలం సరళాసాగర్‌ పరిసరాల్లో ఇది ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది. జడ్చర్లలోని డా.బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన జంతుశాస్త్ర సహాయ ఆచార్యులు బక్షి రవీందర్‌ ఈ పక్షికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తెలియజేశారు. భారత ఉపఖండంతోపాటు దక్షిణ ఆసియా, ఆస్ట్రేలియా దేశాలలో ఉండే ఈ పక్షులు నీరున్న ప్రాంతాలలో చేపలను వేటాడుతూ కనిపిస్తాయి. వివిధ దేశాల్లో వీటిని పవిత్రమైనవిగా కొలుస్తారు. ‘ఆక్సీపిట్రీడే’ కుటుంబానికి చెందిన దాడి చేసే డేగలలో ఇది ఒకటి. దీని శాస్త్రీయ నామం ‘హేలియాస్తర్‌ ఇండస్‌’.

- ఈనాడు, మహబూబ్‌నగర్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని