సెల్ఫీ కోసమే అక్కడికి వెళ్లాలట!

పురాతన వస్తువులను ప్రదర్శించే సంగ్రహాలయాలను చూసుంటాం.. విలువైన, అరుదైన శిల్ప కళలను భద్రపరిచే మ్యూజియంలను సైతం చూసుంటాం. కానీ సెల్ఫీ తీసుకోవడానికి ప్రత్యేకంగా మ్యూజియం ఉంటుందని ఎప్పుడైనా విన్నారా.?

Published : 09 Jan 2020 01:06 IST

అబుదాబి: పురాతన వస్తువులను ప్రదర్శించే సంగ్రహాలయాలను చూసుంటాం. విలువైన, అరుదైన శిల్ప కళలను భద్రపరిచే మ్యూజియంలను సైతం చూసుంటాం. కానీ సెల్ఫీ తీసుకోవడానికి ప్రత్యేకంగా మ్యూజియం లాంటిది ఉంటే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా.. ఆ కోవకే చెందిన ఓ సెల్ఫీ ఫొటో స్పాట్‌ ఇటీవల మీడియా కంట పడింది. దుబాయిలో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఓ ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఫొటో ఫ్రెండ్లీ వాతావరణం కల్పించే విధంగా ‘ది సెల్ఫీ కింగ్‌డమ్‌’ పేరుతో ఈ ప్రత్యేక ఫొటో మ్యూజియంను మంగళవారం ప్రారంభించారు. ఇక్కడ సెల్ఫీలు తీసుకునే వారికి మధుర జ్ఞాపకంలా మిగిలిపోయేవిధంగా ఫొటో బ్యాక్‌గ్రౌండ్ సదుపాయాలు నిర్వాహకులు అందిస్తున్నారు. ఈ సందర్భంగా సెల్ఫీ కింగ్‌డమ్‌ వ్యవస్థాపకురాలు రాణియా నఫా మాట్లాడుతూ.. ‘‘సెల్ఫీ ప్రియులను ఆకట్టుకునేలా ఇక్కడ చాలా అనేక రకాల రంగులతో, బ్యాక్‌గ్రౌండ్‌ గదులతో పాటు సరైన లైటింగ్‌ ఏర్పాటు చేశారు. కళ, సృజనాత్మకత, వ్యక్తిగత స్వేచ్ఛా వాతావరణంతో కూడిన సెల్ఫీ అనుభవాన్ని పొందవచ్చు. ప్రతి ఒక్కరూ ఇక్కడి వచ్చి సెల్ఫీలలో అనుభవం, మధుర జ్ఞాపకాలను సృష్టించుకోవాలని కోరుతున్నాం. మీ సెల్ఫీ సామర్థ్యాలపై మీకు నమ్మకం లేకపోతే ఫొటోగ్రాఫర్‌ను బుక్‌ చేసుకోవచ్చు’’ అని ఆమె పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని