ఆ కేసులో న్యాయకమిషన్‌ ఏర్పాటు:సుప్రీం 

తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే న్యాయ కమిషన్ ఏర్పాటు చేశామని.. విచారణ కోసం నిబంధనల రూపకల్పన చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ. బొబ్డే తెలిపారు.

Updated : 10 Jan 2020 23:56 IST

దిల్లీ: తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘దిశ’ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఇప్పటికే న్యాయ కమిషన్ ఏర్పాటు చేశామని.. విచారణ కోసం నిబంధనల రూపకల్పన చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ. బొబ్డే తెలిపారు. ఎన్‌కౌంటర్‌ను సవాలు చేస్తూ న్యాయవాదులు జీఎస్.మణి, ప్రదీప్, ఎంఎల్ శర్మ, ముకేశ్ దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటు చేసిన న్యాయ కమిషన్ విచారణ కొనసాగుతోందని న్యాయస్థానం పేర్కొంది. దిశ ఘటనలో మీడియా ప్రసారాలపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన నోటీసులను న్యాయవాది ఎంఎల్ శర్మ ఈ సందర్భంగా ప్రస్తావించారు. మాట్లాడే హక్కు మీడియాకు ఉంటుందని.. కానీ ప్రత్యేకించి ఒకరిని లక్ష్యంగా చేసుకోకూడదంటూ కోర్టు అభిప్రాయపడింది. అనంతరం తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా వేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు