
తెలుగు రాష్ట్రాల్లో 11 సార్లు భూ ప్రకంపనలు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలపై భూ భౌతిక పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త శ్రీనగేశ్ స్పందించారు. రాత్రి నుంచి 11 సార్లు చిన్నపాటి భూ ప్రకంపనలు వచ్చాయని, భూకంప లేఖినిపై తీవ్రత 4.6గా నమోదైందని తెలిపారు. భూమి కంపించినప్పుడు ఇళ్ల నుంచి బయటకు రావడమే సురక్షితమని, కట్టడాలు పటిష్టంగా ఉన్నాయో లేవో నిర్ధరణ చేసుకోవాలని సూచించారు.
గత కొన్ని రోజులుగా పులిచింతల ప్రాంతంలో భూమిలో కదలికలు ఏర్పడ్డాయని, మరి కొద్ది రోజుల వరకు భూమిలో ఇలాంటి కదలికలు వస్తాయని వెల్లడించారు. ప్రకంపనలకు భయభ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. సూర్యాపేట జిల్లా దొండపాడు, గుంటూరు జిల్లా అచ్చంపేటలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఖమ్మం, సూర్యాపేట, కృష్ణా జిల్లాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలోని నాగులవంచ, తిమ్మనేనిపాలెం, బస్వాపురం, పాతర్లపాడు గ్రామాలలో, సూర్యాపేట జిల్లాలోని హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో, కృష్ణా జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల పరిధిలోని వివిధ గ్రామాల్లో శనివారం అర్ధరాత్రి దాటాక 2.37 గంటల సమయంలో 3 నుంచి 6 సెకన్ల పాటు భూమి కంపించడంతో తీవ్ర భయాందోళనకు గురయ్యామని స్థానికులు తెలిపారు. ఇంట్లోని వస్తువులు ఒక్కసారిగా కదలడంతో భయంతో బయటకు పరుగులు తీశారు. ఏడేళ్ల క్రితం జనవరి 26న కూడా ఖమ్మం జిల్లాలోని పాతర్లపాడు, నాగులవంచ తదితర గ్రామాలలో భూప్రకంపనలు వచ్చినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలోని అచ్చంపేట, బెల్లంకొండ పరిసరాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించినట్లు సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
-
World News
Antonio Guterres: ఆహార కొరత.. ప్రపంచానికి మహా విపత్తే : ఐరాస చీఫ్ హెచ్చరిక
-
India News
50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
-
Sports News
Bizarre Dismissals: క్రికెట్లో విచిత్రమైన ఔట్లు.. వీటిపై ఓ లుక్కేయండి..!
-
General News
cardiac arrest: అకస్మాత్తుగా గుండె ఆగిపోయినపుడు ఏం చేయాలి..?
-
Politics News
Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు
- 50 States: ఎన్నికల తర్వాత దేశంలో 50 రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వును కరిగించేదెలా అని చింతించొద్దు
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Covid Endemic: కరోనా మహమ్మారి ఎండెమిక్ దశకు వచ్చినట్లేనా..? నిపుణులు ఏం చెబుతున్నారంటే
- Maharashtra: హోటల్ నుంచి పారిపోయి వచ్చా.. శివసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
- Maharashtra Crisis: క్యాన్సర్ ఉన్నా.. శివసేన నన్ను పట్టించుకోలేదు: రెబల్ ఎమ్మెల్యే భావోద్వేగం
- Social Look: నయన్- విఘ్నేశ్‌ల ప్రేమ ‘క్లిక్’.. వేదిక పంచ్!
- Pawan kalyan: బాలినేనీ.. మీ అనుచరులకు ఇది పద్ధతి కాదని చెప్పండి: పవన్ కల్యాణ్
- Droupadi Murmu: గృహహింసను దాటుకొని, అత్యున్నత పదవికి పోటీలో నిలిచి..!