ఏపీలో సీనియర్‌ ఐఏఎస్‌లకు పదోన్నతులు

ఏపీలో కొందరు సీనియర్‌ ఐఏఎస్‌లకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ముఖ్య కార్యదర్శులకు ప్రధాన కార్యదర్శులుగా, కార్యదర్శులను ముఖ్యకార్యదర్శులుగా...

Published : 29 Jan 2020 10:59 IST

అమరావతి: ఏపీలో కొందరు సీనియర్‌ ఐఏఎస్‌లకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ముఖ్య కార్యదర్శులకు ప్రధాన కార్యదర్శులుగా, కార్యదర్శులను ముఖ్యకార్యదర్శులుగా, సంయుక్త కార్యదర్శులుగా పదోన్నతి కల్పించింది. ప్రిన్సిపల్‌ సెక్రెటరీలుగా ఉన్న రజిత్‌ భార్గవ, జవహర్‌రెడ్డి, అనంతరాము, ప్రవీణ్‌కుమార్‌లకు స్పెషనల్‌ చీఫ్ సెక్రటరీలుగా పదోన్నతినిచ్చింది.

సెక్రెటరీ హోదాలో ఉన్న జి. జయలక్ష్మి, ఉషారాణి, రామ్‌గోపాల్‌కు ప్రిన్సిపల్‌ సెక్రెటరీలుగా పదోన్నతి లభించింది. జాయింట్‌ సెక్రెటరీలుగా ఉన్న ముత్యాలరాజు, బసంత్‌కుమార్‌కు కూడా పదోన్నతులు లభించాయి. ఇంటర్‌ క్యాడర్‌ ట్రాన్స్‌ఫర్ల ద్వారా ఏపీకి వచ్చిన నాగాలాండ్ ‌, యూపీ క్యాడర్‌కు చెందిన మంజిర్‌ జిలానీ సమూన్‌, తమీమ్‌ అన్సారియాకు విశాఖలో పోస్టింగ్‌ ఇచ్చారు. వీఎంఆర్డీఏ అదనపు కమిషనర్‌గా మంజిర్‌ జిలానీ సమూన్‌ను, జీవీఎంసీ అదనపు కమిషనర్‌గా తమీమ్‌ అన్సారియాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని