వనదేవతలను వేడుకున్న అమరావతి రైతులు

ఏపీ రాజధాని అమరావతి రైతులు, మహిళలు కొందరు తెలంగాణ రాష్ట్రంలోని మేడారం జాతరకు తరలి వచ్చారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని...

Updated : 08 Feb 2020 15:09 IST

మేడారం: ఏపీ రాజధాని అమరావతి రైతులు, మహిళలు కొందరు తెలంగాణ రాష్ట్రంలోని మేడారం జాతరకు తరలి వచ్చారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని సమ్మక్క, సారలమ్మను వేడుకున్నారు. సీఎం జగన్‌ మనసు మార్చాలని వనదేవతలకు బంగారం సమర్పించి మొక్కుకున్నారు. అమరావతి ప్రాంత రైతుల గోడు వెళ్లబోసుకుంటూ వనదేవతల ఎదుట మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. 3 రాజధానులు వద్దు, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రార్థించారు. ‘జై అమరావతి’ అంటూ నినాదాలు చేశారు. వనదేవతలు తమకు న్యాయం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.
 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని