చంద్రబాబు భద్రతలో మార్పుల్లేవు: డీజీపీ కార్యాలయం

తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతలో ఎలాంటి మార్పులు జరగలేదని డీజీపీ కార్యాలయం ప్రకటించింది. దేశంలోనే అత్యంత హై-సెక్యూరిటీని

Updated : 19 Feb 2020 02:00 IST

అమరావతి: తెదేపా అధినేత, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భద్రతలో ఎలాంటి మార్పులు జరగలేదని డీజీపీ కార్యాలయం ప్రకటించింది. దేశంలోనే అత్యంత హై-సెక్యూరిటీని చంద్రబాబుకు కల్పిస్తున్నట్లు  పేర్కొంది. ప్రస్తుతం జడ్‌ప్లస్‌ సెక్యూరిటిలో చంద్రబాబుకు భద్రత కల్పిస్తున్నట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు, చేర్పులు చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం మొత్తం 183 మందితో భద్రత కల్పిస్తున్నట్లు పేర్కొంది. విజయవాడలో 135 మంది, హైదరాబాద్‌లో 48 మందితో భద్రత చేపట్టినట్లు తెలిపింది. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని