‘నెమ్మదిగా వ్యాపిస్తుంది కానీ ప్రమాదకరం’

కరోనా వైరస్‌ ఫ్లూ కంటే నెమ్మదిగా వ్యాపిస్తుంది కానీ ఫ్లూకంటే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రొస్‌ కరోనా గురించి పలు విషయాలు వెల్లడించారు.

Published : 04 Mar 2020 20:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వైరస్‌ ఫ్లూ కంటే నెమ్మదిగా వ్యాపిస్తుంది కానీ ఫ్లూకంటే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రొస్‌ కరోనా గురించి పలు విషయాలు వెల్లడించారు. ‘ప్రపంచ వ్యాప్తంగా సేకరించిన గణాంకాల ఆధారంగా వ్యాధిని అంచనా వేస్తున్నాం. వైరస్‌ ఫ్లూకంటే నెమ్మదిగా వ్యాపిస్తున్నప్పటికీ ఇది చాలా ప్రమాదకరం. ఆరోగ్యంగా ఉన్నవారిని ఎక్కువగా ప్రభావితం చేయలేదు. కరోనా అన్ని వ్యాధుల్లాంటిది కాదు. విచిత్రమైన లక్షణాలున్న వైరస్‌ ఇది. కరోనా కేసుల్లో కేవలం ఒకశాతం రోగుల్లో మాత్రం లక్షణాలు కనిపించడం లేదు. కానీ, రెండు రోజుల్లోనే వేగంగా వృద్ధి చెందుతున్నాయి. వ్యాధిని నయం చేయడానికి ఇప్పటి వరకూ టీకాలు కానీ.. చికిత్స విధానం కానీ కనుగొనలేదు. మన జాగ్రత్తతోనే వైరస్‌ నుంచి దూరంగా ఉండగలం’ అని ఆయన తెలిపారు.

కాగా.. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా 90వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 3,100కుపైగా మంది మరణించారు. చైనాలో గత 24గంటల్లో 129కేసులు నిర్ధారణ అయ్యాయి. జనవరి 20తో పోల్చితే కరోనా వ్యాప్తిలో కొంత తగ్గుముఖం కనిపిస్తోంది. అందులో 80శాతం కేసులు దక్షిణ కొరియా, ఇరాన్‌, ఇటలీల్లోనే నమోదు కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని