‘గాంధీ’లో ఆ ఫ్లోర్‌లో ఇతరులకు నో ఎంట్రీ!

గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో మార్పులకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశాలు జారీచేశారు. గాంధీలో ఏడో అంతస్తుకు ఇతరులు

Published : 07 Mar 2020 19:39 IST

మంత్రి ఈటల ఆదేశం

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో మార్పులకు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశాలు జారీచేశారు. గాంధీలో ఏడో అంతస్తుకు ఇతరులు వెళ్లకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు 14 రోజులు ఆస్పత్రిలో ఉండాల్సిందేనన్నారు. గాంధీ కరోనా వార్డులో రెండు విభాగాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. విదేశాలకు వెళ్లొచ్చినవారిలో కరోనా లక్షణలు ఉంటే ఒక వార్డు.. విదేశాలకు వెళ్లొచ్చిన వారిలో ఆ లక్షణాలు లేకపోతే మరో వార్డు వినియోగించనున్నట్టు తెలిపారు. 

మరోవైపు, సచివాలయం నుంచి జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో ఈటల వీడియో కాన్ఫరెన్స్‌ కూడా నిర్వహించారు. కరోనా కట్టడికి అనుసరించాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. విదేశాల నుంచి రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు వచ్చిన ప్రతి వ్యక్తి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు సేకరించాలన్నారు. ప్రజల్లో కరోనా పట్ల ఉన్న ఆందోళనను దూరం చేసేందుకు కార్యదర్శి స్థాయి నుంచి ఆశా వర్కర్ల వరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాల్లో వైద్య సిబ్బంది సమయపాలన పాటించకపోయినా, విధులు సరిగా నిర్వర్తించకపోయినా ఉపేక్షించవద్దని అధికారులకు సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తామన్నారు. కొవిడ్‌-19పై ఈ నెల 10న రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని