టెలీమెడిసిన్‌ను ప్రారంభించిన జగన్‌

రాష్ట్రంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ‘వైఎస్‌ఆర్‌ టెలీమెడిసిన్‌’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. క్యాంప్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.. టెలీమెడిసిన్‌ టోల్‌ఫ్రీ నంబర్‌కు సీఎం ఫోన్‌ చేశారు. ఫోన్లో వైద్యుడితో మాట్లాడారు.

Updated : 13 Apr 2020 15:39 IST

అమరావతి : రాష్ట్రంలో కరోనా నివారణ చర్యల్లో భాగంగా ‘వైఎస్‌ఆర్‌ టెలీమెడిసిన్‌’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించారు. క్యాంప్‌ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి.. టెలీమెడిసిన్‌ టోల్‌ఫ్రీ నంబర్‌కు సీఎం ఫోన్‌ చేశారు. ఫోన్లో వైద్యుడితో మాట్లాడారు. టెలీమెడిసిన్‌ విధానాన్ని పటిష్ఠంగా నడపాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని నిత్యం పర్యవేక్షించాలని.. అవసరమైతే వైద్యుల సంఖ్య పెంచాలని సూచించారు.

రాష్ట్రంలో టెలీమెడిసిన్‌ అమలుకు టోల్‌ఫ్రీ నంబర్‌ 14410ని ప్రభుత్వం కేటాయించింది . దీని ద్వారా స్వచ్ఛంద సేవకు 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్‌లు ముందుకు వచ్చారు. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఆరోగ్య సేవలు అందించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని