టీఎస్‌ సీఎంఆర్‌ఎఫ్‌కు రూ.8.30 కోట్ల విరాళాలు

కరోనా మహమ్మారిపై పోరులో రాష్ట్ర ప్రభుత్వానికి దాతలు బాసటగా నిలుస్తున్నారు. కొవిడ్‌ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలుస్తూ పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందిస్తూనే

Published : 09 May 2020 19:58 IST

హైదరాబాద్‌: కరోనా మహమ్మారిపై పోరులో రాష్ట్ర ప్రభుత్వానికి దాతలు బాసటగా నిలుస్తున్నారు. కొవిడ్‌ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు మద్దతుగా నిలుస్తూ పలువురు దాతలు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందిస్తూనే ఉన్నారు. ఇవాళ ఒక్కరోజే సీఎం సహాయనిధికి రూ. 8.30 కోట్ల మేర విరాళాలు వచ్చాయి. ఎల్‌&టీ మెట్రో రైల్‌ రూ. 3 కోట్ల విలువైన పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులను అందజేసింది. ఈ మేరకు ఎల్‌&టీ మెట్రో రైల్‌ సీఈవో కె.వి.బి. రెడ్డి, ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి విరాళానికి సంబంధించిన చెక్కును కేటీఆర్‌కు అందించారు. పేపర్‌ బోర్డ్స్‌ అండ్‌ స్పెషాలిటీ పేపర్స్‌ డివిజన్‌ రూ. 2 కోట్లు విరాళంగా అందించింది. సంస్థ సీఈవో సంజయ్‌ సింగ్‌ కేటీఆర్‌ను కలిసి చెక్కు అందజేశారు. ఐటీసీ ఎండీ సంజీవ్‌ కుమార్‌ రూ. 2 కోట్లు విరాళంగా అందించారు. పోచంపాడ్‌ కన్‌స్ట్రక్షన్‌ ప్రైవైట్‌ లిమిటెడ్‌ రూ. కోటి విలువైన పీపీఈ కిట్లను విరాళంగా అందించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని