మూడు జిల్లాలకు శ్రీవారి లడ్డూలు తరలింపు

తిరుమల నుంచి శ్రీవారి లడ్డూలు శనివారం రాష్ట్రంలోని మూడు జిల్లాలకు బయల్దేరాయి. ప్రస్తుతం తిరుమల నుంచి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని తిరుమల తిరుపతి దేవస్థానం

Updated : 23 May 2020 20:22 IST

తిరుమల: తిరుమల నుంచి శ్రీవారి లడ్డూలు శనివారం ఉదయం రాష్ట్రంలోని మూడు జిల్లాలకు బయల్దేరాయి. ప్రస్తుతం తిరుమల నుంచి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లోని తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కల్యాణ మండపాలకు శ్రీవారి లడ్డూలను మూడు లారీల్లో తరలించారు. లడ్డూలు తరలిస్తున్న మూడు లారీలకు ఉదయం తితిదే అదనపు ఈవో ఎ.వి.ధర్మారెడ్డి పూజలు నిర్వహించిన అనంతరం 1,10,000 లడ్డూలను ఈ లారీల ద్వారా మూడు జిల్లాలకు పంపించారు. మరో 10వేల లడ్డూలను తిరుపతిలో భక్తులకు అందించారు. కరోనా వైరస్‌ ప్రభావంతో తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తుల రాకపోకలను తితిదే రద్దు చేసిన విషయం తెలిసిందే. గత 62రోజులుగా భక్తులకు శ్రీవారి దర్శనం నిలిపివేయడంతో శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే ప్రతి జిల్లాలోని తితిదే కల్యాణ మండపాలు, సమాచార కేంద్రాల్లో లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని