ఆర్‌జీఐఏలో 25నుంచి విమానాల రాకపోకలు

హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) ద్వారా ఈ నెల 25వ తేదీ నుంచి దేశీయ విమానాల రాకపోకలు మొదలవుతాయని.. అందుకు సర్వం సిద్ధం చేసినట్లు ఆర్‌జీఐఏ సీఈవో ఎస్‌జీకే కిషోర్ వెల్లడించారు. ఈ మేరకు విమానాశ్రయంలో..

Published : 23 May 2020 15:50 IST

శంషాబాద్‌: హైదరాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) ద్వారా ఈ నెల 25వ తేదీ నుంచి దేశీయ విమానాల రాకపోకలు మొదలవుతాయని.. అందుకు సర్వం సిద్ధం చేసినట్లు ఆర్‌జీఐఏ సీఈవో ఎస్‌జీకే కిషోర్ వెల్లడించారు. ఈ మేరకు విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విమానాశ్రయంలో సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు సీఈవో తెలిపారు. హైదరాబాద్ విమానాశ్రయం గుండా ప్రయాణించే వారి కోసం క్యూలైన్లలో నిలబడే అవసరం లేకుండానే బోర్డింగ్ పాసులు పొందేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రయాణికులు భౌతిక దూరం పాటించేలా విమానాశ్రయంలో ప్రత్యేకంగా గుర్తులు ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణికులు విమానాశ్రయంలోకి ప్రవేశించింది మొదలు తిరిగి వెళ్లే వరకు పూర్తి స్థాయిలో శానిటైజర్స్‌ అందుబాటులో ఉంచినట్లు వివరించారు. ప్రయాణికుల లగేజీలు తీసుకెళ్లే ట్రాలీలను శానిటైజ్ చేసేందుకు ప్రత్యేకంగా డిసిన్ఫెక్టివ్‌ టన్నెల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. విమానాల్లో ఆహారం తీసుకునేందుకు అనుమతి లేదని.. ప్రయాణికులు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని సీఈవో కిషోర్ వివరించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని