సుధాకర్‌ కేసులో సీబీఐ ముమ్మర దర్యాప్తు

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంలో విశాఖ కేజీహెచ్‌లో రెండో రోజు సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగుతోంది. శనివారం విశాఖలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు వెళ్లి డాక్టర్‌ సుధాకర్‌ను, అక్కడి వైద్య నిపుణులను

Published : 31 May 2020 16:05 IST

సీసీటీవీ ఫుటేజీల స్వాధీనం

విశాఖ: డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంలో విశాఖ కేజీహెచ్‌లో రెండో రోజు సీబీఐ అధికారులు దర్యాప్తు కొనసాగుతోంది. శనివారం విశాఖలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలకు వెళ్లి డాక్టర్‌ సుధాకర్‌ను, అక్కడి వైద్య నిపుణులను అధికారులు విచారించిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలోని పలు రికార్డులను సైతం అధికారులు పరిశీలించారు. దర్యాప్తులో భాగంగా ఇద్దరు వైద్యులు, హౌస్‌సర్జన్ల నుంచి వాంగ్మూలాన్ని అధికారులు ఇప్పటికే నమోదు చేసుకున్నారు. తాజాగా ఇవాళ విచారణలో భాగంగా సుధాకర్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చినప్పటి నుంచి వెళ్లేవరకు ఏం జరిగిందనే విషయాన్ని పరిశీలించేందుకుగాను కేజీహెచ్‌లోని సీసీటీవీ ఫుటేజీలను తీసుకున్న సీబీఐ అధికారులు వాటిని పరిశీలిస్తున్నారు. మెడికో లీగల్‌ కేసు అయినందున ఎంఎల్‌సీ రికార్డును సైతం అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖలో పోలీసులు అరెస్టు చేసిన తర్వాత అంత తొందరగా మానసిక వైద్యశాలలో ఎందుకు చేర్చాల్సివచ్చిందనే కోణంలో కూడా సీబీఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని