రైల్వే ప్రయాణికులకు ద.మ. రైల్వే విజ్ఞప్తి

దాదాపు రెండు నెలల తర్వాత జూన్‌ 1 నుంచి ప్రత్యేక రైళ్ల సేవలు ప్రారంభమైన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. జంట నగరాలైన ..

Published : 03 Jun 2020 16:31 IST

హైదరాబాద్‌: దాదాపు రెండు నెలల తర్వాత జూన్‌ 1 నుంచి ప్రత్యేక రైళ్ల సేవలు ప్రారంభమైన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు ఓ విజ్ఞప్తి చేసింది. జంట నగరాలైన సికింద్రాబాద్‌తో పాటు హైదరాబాద్‌ (నాంపల్లి) స్టేషన్‌లోనూ రైలు సేవలు ప్రారంభమయ్యాయని పేర్కొంది. ఈ రెండు స్టేషన్లనూ తమ ప్రయాణాలకు వినియోగించుకోవచ్చని సూచించింది. ఈ రెండు స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు థర్మల్‌ స్క్రీనింగ్‌ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.

అలాగే, చాలా మంది నిర్దేశించిన సమయం కంటే చాలా ముందుగానే రైల్వేస్టేషన్లకు చేరుకుంటున్నారని, దీని వల్ల రైల్వేస్టేషన్ల వద్ద రద్దీ నెలకొంటోందని పేర్కొంది. ప్రయాణికులు సరైన సమయానికే రావాలని విజ్ఞప్తి చేసింది. రైల్వే ప్రయాణానికి 90 నిమిషాల ముందే రైల్వేస్టేషన్‌కు రావాలని రైల్వే శాఖ సూచించిన సంగతి తెలిసిందే. అయితే, అంతకంటే ముందే కొందరు స్టేషన్లకు పోటెత్తుతుండడంతో ప్రాంగణంలో రద్దీ నెలకొంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని