ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల గురించి తెలుసా?
ఆరోగ్య సంరక్షణ అనేది దేశంలో ముఖ్య విభాగం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అనేది కేవలం వ్యాధి నివారణ, పరీక్షలు, చికిత్సలకే కాదు.. ప్రజల ఆరోగ్యం మెరుగుపడే విధంగా పనిచేయాలి. అయితే ఈ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఒక్కో దేశంలో
ఆరోగ్య సంరక్షణ అనేది దేశంలో ముఖ్య విభాగం. ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ అనేది కేవలం వ్యాధి నివారణ, పరీక్షలు, చికిత్సలకే కాదు.. ప్రజల ఆరోగ్యం మెరుగుపడే విధంగా పనిచేయాలి. అయితే ఈ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలు నాలుగు రకాలుగా ఉన్నాయి. అవేంటో చూద్దాం..
ది బెవెరిడ్జ్ మోడల్
ఈ బెవెరిడ్జ్ వ్యవస్థలో ఆస్పత్రులన్నీ ప్రభుత్వం ఆధీనంలోనే ఉంటాయి. దాదాపు వైద్యులందరూ ప్రభుత్వ ఉద్యోగులుగానే పనిచేస్తారు. చాలా తక్కువ సంఖ్యలో ప్రైవేటు ఆస్పత్రులు ఉంటాయి. ఈ వ్యవస్థలో చికిత్స పొందిన రోగి ఆస్పత్రులకు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. రోగులు పొందే చికిత్సకు ప్రభుత్వమే ఫీజు చెల్లిస్తుంది. ప్రజల నుంచి పన్నుల రూపంలో తీసుకున్న డబ్బునే ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఖర్చు చేస్తుంది. ఆస్పత్రుల్లో చికిత్సలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే నిర్ణయించడంతో పెద్దమొత్తంలో డబ్బు కూడా ఆదా అవుతుంది. ప్రభుత్వానికి ఫార్మాస్యూటికల్ కంపెనీలపై కూడా నియంత్రణ ఉండటంతో మందులకు కూడా పెద్దగా ఖర్చు ఉండదు. అందుకే ఈ బెవెరిడ్జ్ మోడల్ చాలా విజయవంతమైన వ్యవస్థ. దీనిని మొదటిసారి యునైటెడ్ కింగ్‌డమ్‌లో అమలు చేశారు. ప్రస్తుతం బ్రిటన్‌తోపాటు స్పెయిన్, న్యూజిలాండ్, డెన్మార్క్ తదితర దేశాలు అమలు చేస్తున్నాయి.
బిస్మార్క్ మోడల్
ఉద్యోగులు అనారోగ్యానికి గురైతే వారికి చికిత్స నిమిత్తం కంపెనీలు.. ఉద్యోగుల జీతాల్లో నుంచి కొంత డబ్బును ‘సిక్‌నెస్ ఫండ్’కు మళ్లిస్తుంది. ఇది ఆరోగ్య బీమాగా పనిచేస్తుందన్నమాట. ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు అనారోగ్యానికి గురైతే ఈ బీమాతో చికిత్స పొందొచ్చు. ఇదే విధానాన్ని అమెరికా సైతం పాటిస్తోంది. ఎవరైతే ఉద్యోగం ఉండి మెడికేర్‌కు అనర్హులుగా ఉంటారో.. వారికి మాత్రమే కంపెనీ ద్వారా ఆరోగ్య బీమా అందజేస్తుంది. అదీ కూడా పరిమిత చికిత్సలకే. జర్మనీలో ఉద్యోగులకు దాదాపు 200 రకాల ఆరోగ్య బీమాలను ఎంచుకునే సౌలభ్యం ఉంది.
ది నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ మోడల్
పై రెండు వ్యవస్థలు ఈ వ్యవస్థలో పనిచేస్తాయి. పన్నుల రూపంలో వచ్చిన డబ్బును దేశ పౌరుల చికిత్స నిమిత్తం ప్రభుత్వమే ఖర్చు చేయొచ్చు. లేదా ప్రజలకు ఆరోగ్య బీమా చేయించి బీమా సంస్థల ద్వారా చికిత్సలకు అయ్యే ఖర్చును చెల్లించొచ్చు. అయితే ప్రీమియం చెల్లించే విధానం.. వైద్య సేవలు అందే విధానం వేరుగా ఉంటాయి. కెనడాలో రోగులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందినా.. ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందినా ప్రభుత్వం పన్నుల ద్వారా వచ్చిన డబ్బును చికిత్స ఫీజుగా చెల్లిస్తుంది. ఫ్రాన్స్‌లోనూ వైద్య అందే విధానం ఇలాగే ఉంటుంది కానీ.. ప్రభుత్వం పర్యవేక్షణలో ఉన్న లాభాపేక్ష లేని ఆరోగ్య బీమా సంస్థలు చికిత్సకు అయ్యే ఖర్చును భరిస్తాయి. ఇందుకోసం ప్రజలు లేదా ప్రజల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ప్రభుత్వ రంగ.. ప్రైవేటురంగ ఇన్సూరెన్స్ సంస్థలు ఆరోగ్య బీమాను అందిస్తాయి. అయితే వీరందరికి ఒకేలా ప్రీమియం ఉండాలన్నది ఉద్దేశం. రోగులకు, ఇన్సూరెన్స్ కంపెనీలకు నష్టం కలగకుండా ప్రభుత్వాలు కొన్నిసార్లు ‘ఈక్వలైజెషన్ పూల్’పేరుతో సబ్సిడీలు అందజేస్తున్నాయి. నెదర్లాండ్స్‌లో ఈ విధానం అమల్లో ఉంది. అలాగే ఒక్కో దేశంలో ఈ వ్యవస్థ ఒక్కో రకంగా పనిచేస్తుంది. ఈ వ్యవస్థనే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు పాటిస్తున్నాయి.
ప్రైవేటు ఇన్సూరెన్స్ లేదా ఔట్ ఆఫ్ పాకెట్
ఈ నాలుగో ఆరోగ్య వ్యవస్థలో ప్రజలు వ్యక్తిగతంగా ప్రైవేటు ఇన్సూరెన్స్ సంస్థల నుంచి భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించి ఆరోగ్య బీమా పొందాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ లేకుండా చికిత్స పొంది.. దానికి అయ్యే ఫీజును తాము దాచుకున్న డబ్బుతో కట్టాల్సి ఉంటుంది. ఈ విధమైన వ్యవస్థలో ప్రజలకు నష్టమే అధికంగా ఉంటుంది. అన్ని దేశాల్లోనూ ఈ వ్యవస్థ ఉంది.
- ఇంటర్నెట్ డెస్క్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
-
Sports News
Rohit - Gavaskar: ప్రపంచకప్ ముంగిట కుటుంబ బాధ్యతలా? రోహిత్ తీరుపై గావస్కర్ అసహనం
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!
-
Movies News
Srikanth: విడాకుల రూమర్స్.. భార్యతో కలిసి వెళ్లాల్సి వస్తోంది: శ్రీకాంత్
-
Politics News
Panchumarthi Anuradha: అప్పుడు 26ఏళ్లకే మేయర్.. ఇప్పుడు తెదేపా ఎమ్మెల్సీ!