భవిష్యత్‌ తరాల కోసమే హరితహారం: కేటీఆర్‌

భవిష్యత్‌ తరాలకు మంచి పట్టాణాలు అందించేందుకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్‌ కోరారు...

Published : 25 Jun 2020 13:08 IST

హైదరాబాద్‌: భవిష్యత్‌ తరాలకు మంచి పట్టాణాలు అందించేందుకు హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్‌ కోరారు. హైదరాబాద్‌లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి .. దుండిగల్‌ ఐదో ఎగ్జిట్‌ నంబర్‌ వద్ద మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ... అటవీశాతాన్ని పెంపొందించి భవిష్యత్‌ తరాలకు మంచి పర్యావరణాన్ని  అందించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నమని తెలిపారు. 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఓఅర్ఆర్ పక్కన హెచ్ఎమ్ డీఏ భూమిలో ఆరున్నర లక్షల మొక్కలు మియావకి మోడల్ తరహాలో నాటబోతున్నామన్నారు. యాదాద్రి మోడల్ కింద ఆరున్నర లక్షల మొక్కలు  నాటు తామని తెలిపారు. హరిత ఉద్యమ స్పూర్తితో ముందుకెళితే లక్ష్యం నెరవేరుతుందన్నారు. ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటడంతో పాటు వాటిని పరిరక్షించాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ రాజు, మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు హైదరాబాద్‌ బల్కంపేటలో మంత్రులు కేటీఆర్, తలసాని హరిత హారంలో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని