కర్నల్‌ సంతోష్‌బాబు విగ్రహం చూశారా?

తూర్పు లద్దాఖ్‌ వద్ద చైనా దురాక్రమణను సమరశీలంగా ఎదురించి పోరాడిన తెలుగు తేజం కర్నల్‌ ......

Published : 26 Jun 2020 00:20 IST

హైదరాబాద్‌: తూర్పు లద్దాఖ్‌ వద్ద చైనా దురాక్రమణను ధైర్యంగా ఎదిరించి పోరాడిన తెలుగు తేజం కర్నల్‌ సంతోష్‌బాబు వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఆయన గౌరవార్థం స్వస్థలం సూర్యాపేటలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు కర్నల్‌ సంతోష్‌బాబు విగ్రహానికి పశ్చిమ గోదావరి జిల్లాలో శిల్పులు తుది మెరుగులు దిద్ది సిద్ధం చేశారు. ఈ వీర సైనికుడి విగ్రహాన్ని సూర్యాపేట పాత బస్టాండ్‌ కూడలిలో ఏర్పాటు చేయనున్నారు.

ఈ నెల 15న భారత్‌- చైనా సరిహద్దులోని గల్వాన్‌ లోయ వద్ద మన సైనికుల పట్ల డ్రాగన్‌ సైన్యం దురుసుగా ప్రవర్తించింది. ఈ నేపథ్యంలో చోటుచేసుకున్న ఘర్షణలో కర్నల్‌ సంతోష్‌బాబుతో పాటు మరో 19మంది సైనికులు అమరులయ్యారు. తాజాగా, మహారాష్ట్రలోని మాలేగావ్‌కు చెందిన మరో జవాన్‌ విక్రమ్‌ మోరే సైతం ప్రాణాలు కోల్పోయినట్టు భారత సైన్యం వర్గాలు వెల్లడించాయి. దీంతో డ్రాగన్‌ దురాగతానికి అమరులైన భారత సైనికుల సంఖ్య 21కి చేరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని