అక్టోబరు 1 నుంచి సీమ కరవు నివారణ పనులు

విద్యారంగంలో ఏడాదిన్నరలోగా నాడు-నేడు పనులు పూర్తి కావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.

Published : 09 Jul 2020 20:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ 

అమరావతి: విద్యారంగంలో ఏడాదిన్నరలోగా నాడు-నేడు పనులు పూర్తి కావాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన పనులకు నిధుల సమీకరణపై సీఎం సమీక్ష నిర్వహించారు.‘నిధుల సమీకరణపై కచ్చితమైన ప్రణాళిక ఉండాలి. లక్ష్యం నిర్దేశించుకుని వేగంగా పనులు చేయాలని స్పష్టం చేశారు. 

‘‘పాఠశాలలతోపాటు ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లోనూ నాడు-నేడుకు ప్రాధాన్యమివ్వాలి. అక్టోబరు 1 నుంచి రాయలసీమ కరవు నివారణ పనులు ప్రారంభించాలి. పోలవరం నుంచి అదనపు జలాల తరలింపు త్వరగా పూర్తి కావాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు త్వరగా పూర్తి చేయాలని’’ అని సీఎ జగన్‌ ఆదేశించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని