Coffee: కాఫీతో కాలేయ వ్యాధులు దూరం!
కాఫీ తాగేవారు కాలేయ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ముప్పు తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. రోజుకు 3-4 కప్పుల
లండన్: కాఫీ తాగేవారు కాలేయ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ముప్పు తక్కువగా ఉంటుందని తాజా అధ్యయనమొకటి తేల్చింది. రోజుకు 3-4 కప్పుల కాఫీని తీసుకునేవారిలో ఈ ప్రయోజనం మరింత అధికంగా ఉంటున్నట్లు నిర్ధారించింది. బ్రిటన్‌లోని సౌథాంప్టన్ విశ్వవిద్యాలయం, ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు.. మొత్తం 4.95 లక్షల మందిపై సంయుక్తంగా ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కాఫీ తాగే అలవాటు లేనివారితో పోలిస్తే.. కాఫీ తాగేవారు కాలేయ సంబంధిత దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే ముప్పు 21% తక్కువగా, ఫ్యాటీ లివర్ వ్యాధి బారిన పడే ముప్పు 20% తక్కువగా ఉందని గుర్తించారు. కాఫీ ప్రియులు కాలేయ వ్యాధులతో మృత్యువాతపడే అవకాశాలూ 49% తక్కువగా ఉంటున్నట్లు తేల్చారు. కెఫీన్‌తో కూడిన, కెఫీన్ లేని కాఫీల్లో ఏది తాగినా ఈ విషయంలో ఒకేరకమైన ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
మధుమేహ మాత్రతో లాంగ్ కొవిడ్‌కు కళ్లెం
-
Ts-top-news News
11 నెలలుగా...జీవచ్ఛవంలా..!.. ఆకతాయిల దాడే కారణం
-
Ap-top-news News
కుప్పంలో చంద్రబాబు ఇంటికి అడ్డంకులు
-
Sports News
రహానె స్కాన్ వద్దన్నాడు
-
Politics News
ఏపీ నేతలకు మాటలెక్కువ.. పని తక్కువ
-
Crime News
అసహజ శృంగారానికి బలవంతం చేస్తున్నారు.. తెలంగాణ ఐఏఎస్‌పై భార్య ఫిర్యాదు