TS News: మహిళా కండక్టర్లకు రాత్రి 8 గంటల్లోపే విధులు

మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలకల్లా తమ డిపోలకు చేరేలా డ్యూటీలు వేయాలని ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలని

Updated : 29 Dec 2021 09:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: మహిళా కండక్టర్లు రాత్రి 8 గంటలకల్లా తమ డిపోలకు చేరేలా డ్యూటీలు వేయాలని ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను తక్షణం అమలు చేయాలని పేర్కొన్నారు. ఆర్టీసీలో సుదీర్ఘ సమ్మె ముగిసిన తరవాత 2019 డిసెంబరు ఒకటో తేదీన అన్ని స్థాయుల ఉద్యోగులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమావేశంలో డ్యూటీ సమయాలు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ పలువురు మహిళా కండక్టర్లు ఫిర్యాదు చేశారు. రాత్రి 8 గంటలకల్లా వారి విధులు ముగిసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. దీంతో డ్యూటీ సమయాలను మారుస్తూ సమావేశం జరిగిన మూడో రోజులకే(డిసెంబరు 4న) అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొద్దికాలం వాటిని అమలు చేసినా.. ఆ తరవాత రద్దు చేశారు. రాత్రి 8 గంటల తరవాత కూడా విధులు నిర్వహించాల్సి వస్తోందంటూ ఇటీవల పలువురు మహిళా కండక్టర్లు ఫిర్యాదు చేయటంతో ఎండీ సజ్జనార్‌  తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని